పోలీస్ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

TPCC President Revanth Reddy Writes Letter to CM KCR Over Age Limit Issue in Police Recruitment, Revanth Reddy Writes Letter to CM KCR Over Age Limit Issue in Police Recruitment, TPCC President Writes Letter to CM KCR Over Age Limit Issue in Police Recruitment, Age Limit Issue in Police Recruitment, Police Recruitment Age Limit Issue, Police Recruitment, Age Limit Issue, TPCC President Revanth Reddy Writes Letter to CM KCR, Revanth Reddy Writes Letter to CM KCR, TPCC Chief Revanth Reddy, TPCC President Revanth Reddy, TPCC President, Revanth Reddy, Age Limit Issue in Police Recruitment News, Age Limit Issue in Police Recruitment Latest News, Age Limit Issue in Police Recruitment Latest Updates, Age Limit Issue in Police Recruitment Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల భారీ సంఖ్యలో పోలీస్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితి అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల వయోపరిమితిని ప్రభుత్వం ఇప్పటికే మూడేళ్లు పెంచింది. అయితే 17 వేలకు పైగా పోస్టుల భర్తీ కోసం జారీచేసిన నోటిఫికేషన్స్ లో కానిస్టేబుల్ పోస్టులు అధికంగా ఉన్నాయని, కేవలం మూడేళ్లే కాకుండా మరో రెండు ఏళ్ల వయోపరిమితిని పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

వయోపరిమితి పెంచకపోతే 4 లక్షల మంది అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన యువతకు ఐదేళ్ల పాటు వయో పరిమితి ఇవ్వాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలని, తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని యువత భావించిందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్న విధంగా వయో పరిమితి పెంచాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 2 =