తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇటీవలే ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నిక కోసం నేడు (అక్టోబర్ 7, శుక్రవారం) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచే ఉపఎన్నిక కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 7 నుంచి 14 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. నామినేషన్ల స్వీకరణ కోసం చండూరు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావును నియమిస్తూ నల్గొండ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గడువు ముగిసేవరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్స్ దాఖలు చేసేందుకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు.
ఇక నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 15న జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరుతేదీగా అక్టోబర్ 17ను కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక నవంబర్ 3 తేదీన పోలింగ్ నిర్వహించి, నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. నేటి నుంచే నామినేషన్ల పక్రియ ప్రారంభం కానుండడంతో తెలంగాణలో మరోసారి ఉపఎన్నికల సందడి మొదలుకానుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు స్థానం ఖాళీ అవడంతో అక్కడ ఉపఎన్నిక జరుగుతుంది. ఈ స్థానంలో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే వ్యూహరచన ప్రారంభించాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ బరిలో ఉండగా, అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగబోతున్నారో ఇంకా ప్రకటించాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY