తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు (జూన్ 1, సోమవారం) నుంచి మద్యం షాపులను రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర అబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలో ఆ శాఖ యొక్క అన్ని స్థాయిల అధికారులకు సమాచారం ఇచ్చి, ఈ రోజు నుంచే ఈ నిర్ణయం అమలయ్యేట్లు చూడాలని ఆదేశించారు. గత నిబంధనల ప్రకారం మే 31వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు తెరిచేందుకు అనుమతిచ్చారు.
లాక్డౌన్ 5.0 కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్త మార్గదర్శకాలు ప్రకటించారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులు మినహా ఇతర షాపులను రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మద్యం షాపులు కూడా మరో రెండు గంటల పాటు పొడిగిస్తూ అబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu