మంత్రి జగదీష్ రెడ్డితో సీపీఐ, సీపీఎం నాయకుల కీలక భేటీ.. ఈనెల 12న మునుగోడులో వామపక్షాల ఆధ్వర్యంలో బహిరంగ సభ

Munugode By-Poll Minister Jagadish Reddy Meets CPI CPM Leaders and Plans For Public Meeting on Oct 12, Minister Jagadish Reddy Meets CPI CPM Leaders, Plans For Public Meeting on Oct 12, Munugode By-Poll, Mango News, Mango News Telugu, TRS Party Victory, TRS Party, Munugode By-Poll, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడులో ఉప ఎన్నికల సంరంభం ఆరంభమైంది. ఈ ఉపఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ప్రకటనతో పాటు ప్రచారంలో కూడా ముందుంటున్నాయి. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంతవరకు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. అయినా పక్కా ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నల్లగొండలో కొంచెం పట్టున్న వామపక్షాలతో ఇప్పటికే సయోధ్య కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో.. సీపీఐ, సీపీఎం నాయకులతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గదీష్ రెడ్డి కీలక స‌మావేశం నిర్వ‌హించారు. దీనిలో మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ధీటుగా ఎదుర్కొనే వ్యూహాలతో పాటు, టీఆర్ఎస్ అభ్య‌ర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు.

ఇక ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ పార్టీలు సంయుక్తంగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నాయి. ఈ సమావేశంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడానికి గల కారణాలను ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని వామపక్షాలు భావిస్తున్నాయి. ఈ బహిరంగ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులు హాజరు కానున్నట్లు లెఫ్ట్ పార్టీలు పేర్కొన్నాయి. మంత్రితో భేటీ అయిన వారిలో వామపక్ష పార్టీల నేతలు.. మాజీ ఎమ్మెల్యే జూల‌కంటి రంగారెడ్డి, ప‌ల్లా వెంక‌ట్ రెడ్డి, సీపీఎం న‌ల్ల‌గొండ‌, యాదాద్రి జిల్లాల కార్య‌ద‌ర్శులు ముదిరెడ్డి సుధాక‌ర్ రెడ్డి, జ‌హంగీర్, సీపీఐ న‌ల్ల‌గొండ‌, యాదాద్రి జిల్లాల కార్య‌ద‌ర్శులు నెల్లికంటి స‌త్యం, గోదా శ్రీరాములు తదిత‌రులతో పాటు న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ఇంచార్జి, ఎమ్మెల్సీ త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు కూడా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + five =