వాతావరణశాఖ కీలక సూచన.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

Weather Forecast IMD Issues Heavy Rain Alert in AP and Telangana For Next 2-3 Days, Indian Meteorological Department, Heavy Rains Ap And Telangana, 2 Days Heavy Rains In Telangana And AP, IMD Predicts Heavy Rains In AP, IMD Predicts Rains In AP For 2 Days, Heavy To Moderate Rainfall In AP, Mango News, Mango News Telugu, India Weather Highlights, Weather Updates, IMD Predicts Moderate Rainfall In AP, Severe Rainfall Alert, Cyclone Alert In Andhra Pradesh Today 2022, IMD Weather Forecast, India Meteorological Department, IMD Latest News And Updates

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సూపర్ సైక్లోన్ ‘నోరు’ కారణంగా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినందున, దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్ మరియు హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుందని పేర్కొంది. అలాగే పర్వత ప్రాంతాలైన ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలో తేలికపాటి నుండి భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని తెలిపింది.

ఇక కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాలలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి, భద్రాచలం తదితర జిల్లాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కూడా మోశారు నుంచి భారీ వర్షం కురవొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా ఆంధ్రాలోని విజయవాడ, విశాఖల్లో గంటలపాటు ఏకధాటిగా భారీ వర్షం పడనున్నట్లు హెచ్చరించింది. గత రెండు రోజుల నుంచీ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అసాధారణ రీతిలో కురుస్తున్న వర్షాలకు కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఒంగోలులో హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లు.. 99497 96033, 85559 31920.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + twenty =