ఏపీ పాలిసెట్‌-2022 ప్రవేశ పరీక్ష, రేపే 404 కేంద్రాల్లో నిర్వహణ

Andhra Pradesh POLYCET-2022 Exam to be held on May 29th, POLYCET-2022 Exam to be held on May 29th, Andhra Pradesh POLYCET-2022 Exam, AP Polycet 2022, 2022 AP Polycet, AP Polycet 2022 exam will be conducted on May 29 2022, AP POLYCET-2022 to be held tomorrow, 2022 AP POLYCET to be held tomorrow, State Board of Technical Education and Training will conduct the Andhra Pradesh Polytechnic Common Entrance Test-2022 on May 29, Andhra Pradesh Polytechnic Common Entrance Test-2022 on May 29, State Board of Technical Education and Training, Polytechnic Common Entrance Test-2022 on May 29, 2022 Polytechnic Common Entrance Test on May 29, POLYCET-2022 Exam News, POLYCET-2022 Exam Latest News, POLYCET-2022 Exam Latest Updates, POLYCET-2022 Exam Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌/డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిటెక్నిక్‌ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పాలిసెట్‌-2022) ను రేపు (మే 29, ఆదివారం) నిర్వహించనున్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్-2022 నిర్వహిస్తున్నామని, ఇందుకోసం 404 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ‌ కమీషనర్ పోలా భాస్కర్ వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి‌ మధ్యాహ్నం 1 గంట వరకు పాలిసెట్‌-2022 ప్రవేశ పరీక్ష జరుగనుందని, విద్యార్థులను ఉదయం పది గంటల నుంచే పరీక్షా కేంద్రాలోకి అనుమతిస్తామని చెప్పారు. పాలిసెట్ కోసం మొత్తం 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.

ఈ పాలిసెట్ పరీక్ష 120 మార్కులకి జరుగుతుండగా, ఫలితాలను పరీక్ష జరిగిన నాటి నుంచి పది రోజుల్లో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు https://polycetap.nic.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. కాగా ఏపీలో మొత్తం 70 వేలపైగానే పాలిటెక్నిక్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + fourteen =