మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ పూర్తిచేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుండగా, కొరటాల శివ దర్శకత్వం వహించబోయే సినిమాకి సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ రోజు చిరంజీవిని ఆయన సోదరుడు, జనసేన అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్, మరియు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కలుసుకున్నారు. హైదరాబాద్ లో చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఆయనతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి నాదెండ్ల మనోహర్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ఫోటో ని పోస్ట్ చేసారు.
చిరంజీవిని కలిసిన సందర్భం గురించి, నాదెండ్ల మనోహర్ ట్విట్టర్లో స్పందిస్తూ ‘ పవన్ కళ్యాణ్ మరియు నేను, సైరానరసింహరెడ్డి (చిరంజీవి) తో అద్భుతమైన సమావేశం జరిపాము.ఈ భేటీలో అనేక అంశాలను చర్చించాం, అతని జీవిత ప్రయాణం ఎప్పుడూ మాకు స్ఫూర్తీ కలిగిస్తూనే ఉంటుంది, చిరంజీవి మరిన్ని విజయాలు సాధించాలని, మరియు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సంభాషణల కోసం ఎదురు చూస్తున్నాను’ అని చెప్పారు.
[subscribe]
[youtube_video videoid=yLy1Q6kT2gQ]







































