దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇప్పటికే వరుసగా పలు జిల్లాల నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9న లక్షమంది సమక్షంలో ఖమ్మం వేదికగా సంకల్ప సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ సభకు ఖమ్మం పోలీసులు అనుమతి ఇచ్చారు. మాస్కులు ధరించడం, శానిటైజర్లు ఏర్పాటు, ఇతర కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ పోలీసులు సభకు అనుమతిని జారీ చేశారు. ఈ సభలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల ప్రకటన చేయడంతో పాటుగా పార్టీ పేరును ప్రకటించనున్నట్టు సమాచారం. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పోటీచేయనున్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ