కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు, ప్రికాషన్ డోసు మధ్య వ్యవధిని తగ్గించండి, కేంద్రానికి మంత్రి హరీశ్ రావు లేఖ

booster dose, Harish Rao Writes Letter To Union Health Minister, Harish Rao Writes Letter To Union Health Minister Over Precautionary Dose Interval, Harish Rao writes to Union health min Mansukh Mandaviya, Harish Rao writes to Union health minister, Mango News, Minister Harish Rao, Minister Harish Rao Writes Letter To Union Health Minister Over Precautionary Dose, Minister Harish Rao Writes Letter To Union Health Minister Over Precautionary Dose Interval, Telangana for reducing interval between covid doses, Telangana health minister Harish Rao writes to Union health min Mansukh Mandaviya, Telangana seeks booster dose against Covid

కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా జనవరి 10వ తేదీ నుంచి తెలంగాణలో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు మరియు 60 ఏళ్లు వయసుపైబడి కోమార్బిడిటీస్ (సహ-అనారోగ్యాలు) ఉన్నవారికీ ప్రికాషన్ డోస్ (కోవిడ్ వ్యాక్సిన్) అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రికాషన్ డోసుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయాకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం లేఖ రాశారు. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు మరియు ప్రికాషన్ డోసు మధ్య వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని లేఖలో కోరారు.

హెల్త్‌కేర్ వర్కర్స్ కు సంబంధించి రెండో డోసు మరియు ప్రికాషన్ డోసు మధ్య వ్యవధిని 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే కోమార్బిడిటీస్ తో సంబంధం లేకుండా 60 ఏళ్లు వయసుపైబడిన పెద్దలందరికి ప్రికాషన్ డోసు పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక 18 సంవత్సరాలు దాటినా ప్రతి పౌరుడికి బూస్టర్ డోసు అందించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ చర్యలు కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌తో వచ్చే తీవ్రమైన అనారోగ్యం మరియు మరణాల నుండి ప్రజలను రక్షించడానికి సహాయపడతాయని పేర్కొన్నారు. అమెరికా, యూకే వంటి దేశాలు అమలుచేస్తున్న బూస్టర్ డోస్ పాలసీస్ ఆధారంగా ఈ ప్రతిపాదనలు చేస్తునట్టు మంత్రి హరీశ్ రావు లేఖలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =