రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాచలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె ప్రముఖ పుణ్యక్షేత్రం సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఉదయం ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆలయ ఈఓ శివాజీలు స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్రపతిని ఆలయంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ద్రౌపది ముర్ముకి ఆలయ వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఆ తర్వాత ఆలయ అధికారులు రాష్ట్రపతికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇక భద్రాద్రి పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము ‘ప్రసాద్’ పథకంలో భాగంగా రామాలయంలో ఏర్పాటు చేసిన సుమారు రూ.41 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాత మధు, భద్రాచలం శాసనసభ్యులు పొదెంవీరయ్య, టూరిజం ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE








































