ఏపీలో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Elections Notification Released 4 Rajya Sabha Seats in AP and 2 in Telangana, Elections Notification Released 2 Rajya Sabha Seats in Telangana, Elections Notification Released 4 Rajya Sabha Seats in AP, Elections Notification Released Rajya Sabha Seats in AP, Elections Notification Released Rajya Sabha Seats in Telangana, Rajya Sabha Seats in Telangana, Rajya Sabha Seats in AP, Elections Notification Released, Rajya Sabha elections, Rajya Sabha elections Notification Released, Rajya Sabha elections Notification Released For Telangana, Rajya Sabha elections Notification Released for AP, Rajya Sabha Seats election, Rajya Sabha elections News, Rajya Sabha elections Latest News, Rajya Sabha elections Latest Updates, Rajya Sabha elections Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలోని 15 రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న 57 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నేడు (మే 24, మంగళవారం) నోటిఫికేషన్ విడుదల అయింది. నేటి నుంచే ఈ స్థానాలకు నామినేషన్లను స్వీకరించనుండగా, నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు మే 31గా నిర్ణయించారు. జూన్ 1న నామినేషన్ల పరిశీలన జరగనుంది, అలాగే జూన్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక ఈ రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, ఓట్ల లెక్కింపు పక్రియ కూడా అదే రోజున జరుగుతుందని ఈసీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్ ల యొక్క పదవీకాలం జూన్ 21, 2022తో పూర్తవనుంది. ఈ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు, హెటిరో అధిప‌తి డాక్ట‌ర్ పార్థ‌సార‌థి రెడ్డి పేర్లను టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వీరు మే 25, బుధవారం తమ నామినేషన్లు దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రభు సురేష్ ప్రభాకర్, టీజీ వెంకటేష్, యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), వి.విజయసాయి రెడ్డి యొక్క పదవీకాలం జూన్ 21, 2022తో పూర్తవనుంది. ఈ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా ఎంపీ విజయసాయి రెడ్డి, న్యాయవాది నిరంజన్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు పేర్లను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. వీరు కూడా త్వరలోనే నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + twelve =