ఆస్తిపన్నుపై 90 శాతం వడ్డీ తగ్గింపు, ఓటీఎస్‌ పథకం ప్రారంభం

GHMC, Municipalities in Telangana, Property Tax Interest, Property Tax Interest Decreased, Property Tax Interest Decreased by 90 Percent, Property Tax Interest Decreased by 90 Percent in GHMC, Property Tax Interest Rates, telangana

రాష్ట్రంలోని అన్ని మున్సి‌పా‌లి‌టీ‌ల‌లో ఆస్తి‌పన్ను బకా‌యి‌దా‌రు‌లకు తెలంగాణ ప్రభుత్వం శుభ‌వార్త అందించింది. జీహెచ్‌ఎంసీ, సహా ఇతర మున్సిపాలిటీల్లో కూడా ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్) పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద ఆస్తి పన్ను బకాయిదారులంతా 2019-20 సంవత్సరానికి ఆస్తి పన్ను మొత్తాన్ని పది శాతం వడ్డీతో కడితే, 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఆగస్టు 1 వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అసలు, వడ్డీతో కలిసి ఆస్తి పన్ను బకాయిలు భారీగా పేరుకుపోవడంతో, పన్ను చెల్లింపుదారులకు కూడా ప్రయోజనం కల్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =