‘యువగళం’ పేరిట నారా లోకేష్ మహా పాదయాత్ర, జనవరి 27 నుంచి 400 రోజుల పాటు 4000 కి.మీ

Nara Lokesh Maha Padayatra Named as Yuvagalam Starts from January 27 at Kuppam Continue for 400 Days upto 4000 km,Nara Lokesh Maha Padayatra,Yuvagalam Padayatra,Yuvagalam Starts from January 27,Mango News,Mango News Telugu,Maha Padayatra Today,Maha Padayatra Schedule,Maha Padayatra Live Today,Yuvagalam Padayatra Today,Yuvagalam Padayatra Schedule,Yuvagalam Padayatra 2 0 Route Map,Maha Padayatra Route Map,Yuvagalam Padayatra Route Map,Maha Padayatra,Maha Padayatra Live,Maha Padayatra 2.0 Route Map,Maha Padayatra Route,Amravati Maha Padayatra,Amaravathi Maha Padayatra Route Map,Yuvagalam Farmers Maha Padayatra,Amravati Maha Padayatra Route Map,Yuvagalam Farmers Maha Padayatra Route Map,Yuvagalam Maha Padayatra,Mahatma Gandhi Padayatra

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతున్నట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర పేరు, ప్రారంభ తేది, పాదయాత్ర ఎక్కడ నుంచి ప్రారంభం కానుంది, ఎన్ని రోజులు ఎన్ని కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది అనే విషయాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేడు అధికారికంగా ప్రకటించింది. నారా లోకేష్ మహాపాదయాత్రను ‘యువగళం’ పేరిట నిర్వహించనున్నట్టు టీడీపీ తెలిపింది.

2023, జనవరి 27వ తేదీ నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి ప్రారంభమయ్యే నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని తెలిపారు. నారా లోకేష్ పాదయాత్ర వివరాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పార్టీ సీనియర్‌ నేతలు బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్ర జెండాను కూడా ఆవిష్కరించారు.

“యువతను చైతన్యపరచి వారి అభిప్రాయాలను, ఆకాంక్షలను తెలుసుకోడానికి, ప్రశ్నించే హక్కును కోల్పోయిన యువ గొంతుకలకు అండగా నిలిచేందుకు 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహాపాదయాత్ర ‘యువగళం’ పేరిట 2023, జనవరి 27 నుంచి ప్రారంభం కానుంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి ప్రారంభమయ్యే నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో మీరూ భాగస్వాములవ్వండి. మరిన్ని వివరాలకు https://yuvagalam.com ను సందర్శించండి” అని టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 10 =