తెలంగాణలో కోవిడ్-19 వాక్సినేషన్ కు పటిష్టమైన ఏర్పాట్లు చేశాం : సీఎస్

Arrangements for Covid-19 Vaccination, Cabinet Secretary Rajiv Gauba, Centre Decides to Start Corona Vaccination Drive, Corona Vaccination Drive, coronavirus vaccine distribution, Coronavirus Vaccine Distribution In India, COVID 19 Vaccine, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India Coronavirus Vaccine Distribution, Mango News, Nationwide COVID 19 Vaccine Distribution, Rajiv Gauba Requested All CSs, Union Cabinet Secretary Rajiv Gauba, Vaccine Distribution

దేశంలో కోవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించడానికి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌభ సూచించారు. శనివారం నాడు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్ నెంట్ గవర్నర్లు తో కేంద్ర కేబినెట్ సెక్రెటరీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కోవిడ్-19 వాక్సినేషన్ సంసిద్ధతను సమీక్షించారు. డ్రైరన్స్ అనుభవాలను పరిగణనలోకి తీసుకొని వాక్సినేషన్ అమలుకు వ్యవస్థాపరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని హెల్త్ కేర్ప్స్ వర్కర్లు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్ల తో పాటు 50 సంవత్సరాలు వయసు పైబడిన వారికి కోవిడ్-19 వాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్-19 వాక్సినేషన్ కు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర కేబినెట్ సెక్రెటరీకి వివరించారు. పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్న వర్కర్లు హై రిస్క్ పరిస్థితుల్లో పనిచేస్తున్నారని, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వారికి కూడా వాక్సినేషన్ ఇవ్వాలని కోరారు. అలాగే గతంలో జరిగిన వీడియో కాన్ఫెరెన్స్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ కోరిన విధంగా ప్రజా ప్రతినిధులకు కూడా కోవిడ్-19 వాక్సినేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, డ్రగ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ డా.ప్రీతి మీనా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా.కే.రమేష్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ