బాగ్‌లింగంప‌ల్లిలో 126 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

developmental works In LB Nagar, KTR, KTR Inaugurated Several Development Works, KTR inaugurates developmental works, KTR inaugurates developmental works In LB Nagar, LB Nagar, lb nagar drinking water reservoir, Mango News, Minister KTR, Minister KTR Inaugurated Several Development Works in City, Minister KTR Latest News, telangana

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ శ‌నివారం నాడు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో కలిసి దోమలగూడలో జీహెఛ్ఎంసీ జోనల్‌/సర్కిల్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆతర్వాత అంబర్ పేట్ నియోజకవర్గంలోని నారాయణగూడలో నూతనంగా నిర్మించే మోడ్రన్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు.

అనంతరం బాగ్‌లింగంప‌ల్లిలోని లంబాడీ తండాలో ప్రభుత్వం సకల వసతులతో రూ.10 కోట్ల 96 ల‌క్ష‌ల‌తో నిర్మించిన 126 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అడిక్‌మెట్‌లో కొత్త‌గా నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ బ‌హుళ వినియోగ క్రీడా భ‌వ‌న కాంప్లెక్స్ లో బాస్కెట్ బాల్ కోర్టు, బ్యాడ్మింట‌న్ కోర్టు, టేబుల్ టెన్నిస్‌, జిమ్ సౌక‌ర్యంతో పాటు ఇండోర్ గేమ్స్ ఆడుకునేందుకు వ‌స‌తులు క‌ల్పించారు.

అనంతరం ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.9.42 కోట్ల వ్యయంతో కొత్త పేట్ లో నిర్మించిన 2.5 ఎంఎల్‌ (మిలియన్ లీటర్లు) సామర్ధ్యం గల రెండు మంచినీటి రిజర్వాయర్లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్యే ముఠా గోపాల్,‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here