18 నుంచి ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం, ఆఫ్‌లైన్ లోనే ఇంటర్ అడ్మిషన్లు

Andhra Pradesh Inter 1st year classes, AP Education Minister, AP Education Minister Adimulapu Suresh, AP Inter 1st Year Classes, AP Inter 1st Year Classes Start, AP Inter 1st Year Classes Start From JAN 18th, AP Intermediate 1st Year, Education minister Adimulapu Suresh, Education Minister Adimulapu Suresh Press Meet, Inter first-year classes in Andhra Pradesh, Intermediate Education Board of Andhra Pradesh, Mango News Telugu

జనవరి 18వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది ఆప్ లైన్లోనే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఆన్ లైన్లో అడ్మిషన్లు నిర్వహించనున్నామన్నారు. త్వరలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. అలాగే 11 తేదీన జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆన్ లైన్ ద్వారా విడుదల చేయనున్నామని మంత్రి తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం నాడు విలేకరుల సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ఆఫ్ లైన్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశామన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచే అడ్మిషన్ దరఖాస్తులు విక్రయాలు ప్రారంభమయ్యాయన్నారు. ఈ నెల 17 వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి గడువని, అదే రోజు అడ్మిషన్లు కూడా పూర్తవుతాయని మంత్రి తెలిపారు. ఆ మరుసటి రోజు అనగా ఈ నెల 18వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 19 =