తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యాసంగి సీజన్ కు సంబంధించి రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీ డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదోరోజు (జనవరి 2, సోమవారం) జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేశారు. ఐదోరోజున 1,51,468 మంది రైతుల ఖాతాల్లోకి రూ.265.18 కోట్ల రైతుబంధు నిధులు జమ చేసినట్టు మంత్రి వెల్లడించారు. 5,30, 371.31 ఎకరాలకు నిధులు విడుదల జరిగిందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల కళ్లలో ఆనందమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరంటు రాక, సాగునీళ్లు లేక రైతాంగం వ్యవసాయం వదిలేసి వలసబాట పట్టారని, బోరు బావుల కింద వ్యవసాయం చేయలేక రైతాంగం నష్టాల పాలయ్యారని అన్నారు. “కేవలం ఎనిమిదేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపం మారిపోయింది. రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు పథకాలు చారిత్రాత్మకమైనవి. వ్యవసాయరంగం బలపడితేనే దేశం పటిష్టంగా ఉంటుంది. తెలంగాణ పథకాలు చూసి దేశ రైతాంగం బీఆర్ఎస్ వైపు చూస్తున్నది. సంపద పెంచాలి, ప్రజలకు పంచాలి అన్నదే సీఎం కేసీఆర్ విధానం. 47.75 లక్షల మందికి ప్రతి నెలా ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇందులో చిన్న, సన్నకారు రైతులు కూడా ఉన్నారు. 11.55 లక్షల మందికి కళ్యాణలక్ష్మి, 12.66 లక్షల మందికి కేసీఆర్ కిట్లు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. 2014లో 298 గురుకులాలు ఉంటే నేడు 1201 గురుకులాలు ఉన్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయ, ఉపాధి రంగాలలో గణనీయమైన వృద్ది సాధించాం. బీఆర్ఎస్ తో దేశ రాజకీయాల్లో కేసీఆర్ తనదైన ముద్ర వేయడం ఖాయం” అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE