రేపు 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభసెషన్‌ను ప్రారంభించి, ప్రసంగించనున్న ప్రధాని మోదీ

PM Modi will Inaugurate and Address the 108th Indian Science Congress Tomorrow,PM Modi will Inaugurate,Address the 108th Indian Science Congress,108th Indian Science Congress,Indian Science Congress,Indian Science Congress Latest News and Updates,Indian Science Congress 108th,Indian Science Congress News,Indian Science Congress Latest News,PM Narendra Modi, Modi Latest News And Updates,Gujarat Assembly News And Live Updates,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (జనవరి 3, మంగళవారం) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ) ప్రారంభ సెషన్‌ను ప్రారంభించి, ప్రసంగించనున్నారు. ఐఎస్సీ ప్రారంభ వేడుకలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఐఎస్సీ మొదటి సెషన్ 1914లో జరగగా, తాజాగా ఐఎస్సీయొక్క 108వ వార్షిక సమావేశాన్ని అమరావతి రోడ్ క్యాంపస్‌లోని రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం ఐఎస్సీ యొక్క ఫోకల్ థీమ్ ను “సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ విమెన్ ఎంపవర్మెంట్” గా నిర్ణయించారు. ఈ సమావేశంలో సుస్థిర అభివృద్ధి, మహిళా సాధికారత మరియు దీనిని సాధించడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగనున్నాయి.

ఈ సమావేశంలో పాల్గొనేవారు బోధన, పరిశోధన మరియు పరిశ్రమల ఉన్నత స్థాయిలలో మహిళల సంఖ్యను పెంచే మార్గాలపై, ఎస్టీఈఎం (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) విద్య, పరిశోధన అవకాశాలు, ఆర్థిక భాగస్వామ్యంపై సమాన అవకాశం అందించే మార్గాలను కనుగొనే ప్రయత్నంపై చర్చించనున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళల సహకారాన్ని ప్రదర్శించే ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించబడుతుందని, ఇందులో ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్తల ఉపన్యాసాలు కూడా ఉంటాయన్నారు. ఐఎస్సీతో పాటు అనేక ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయని, పిల్లలలో శాస్త్రీయ ఆసక్తి మరియు స్వభావాన్ని పెంపొందించడంలో సహాయపడటానికి బాలల సైన్స్ కాంగ్రెస్ కూడా నిర్వహించబడుతుందని తెలిపారు. ఫార్మర్ సైన్స్ కాంగ్రెస్ బయో-ఎకానమీని మెరుగుపరచడానికి మరియు యువతను వ్యవసాయం వైపు ఆకర్షించడానికి ఒక వేదికను అందిస్తుందన్నారు. ట్రైబల్ సైన్స్ కాంగ్రెస్ కూడా నిర్వహించబడుతుందని, ఇది గిరిజన మహిళల సాధికారతపై దృష్టి సారించడంతో పాటు దేశీయ ప్రాచీన విజ్ఞాన వ్యవస్థ మరియు అభ్యాసాల శాస్త్రీయ ప్రదర్శనకు వేదిక అవుతుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =