హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు, ఏకసభ్య కమిటీ నియామకం

Supreme Court Dissolves HCA Committee Appoints Single Member Committee to Oversee Pending Polls,Supreme Court Dissolves HCA Committee, Appoints Single Member Committee,Oversee Pending Polls,Mango News,Mango News Telugu,Supreme Court Judge,Wi Supreme Court Election 2023,Supreme Court Today Judgement,Supreme Court Statues,Supreme Court Order,Supreme Court Of India Judgements,Supreme Court Of India Case Status,Supreme Court Display Board,Supreme Court Coverage,Supreme Court Cause List,Supreme Court Case Status,Section 230 Supreme Court,Abortion Leak Supreme Court

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కమిటీకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తూ బుధవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుత హెచ్‌సీఏ కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని నియమిస్తునట్టు ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇకపై హెచ్‌సీఏ వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఏకసభ్య కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి ఆదేశాలు జారీచేయనున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గత కొంతకాలంగా హెచ్‌సీఏలో చోటుచేసుకున్న పలు పరిణామాలు అనంతరం ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన ఏర్పడింది. తాజా సుప్రీంకోర్టు తీర్పుతో త్వరలోనే హెచ్‌సీఏ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న హెచ్‌సీఏ ఎన్నికలను ఏక సభ్య కమిటీ పర్యవేక్షించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 16 =