రేపు కొండగట్టు పర్యటనకు సీఎం కేసీఆర్‌, పూర్తి షెడ్యూల్ ఇదే…

CM KCR to Visit Kondagattu Tomorrow Full Schedule Details Here,CM KCR to Visit Kondagattu Tomorrow, Full Schedule Details Here,CM KCR to Visit Kondagattu,Mango News,Mango News Telugu,CM KCR to Visit Kondagattu,Kondagattu February 15th, Minister Koppula Eshwar Inspects Arrangements,CM KCR Appointed Dr Ediga Anjaneya Goud,KCR Appointed Dr Ediga Anjaneya,CM KCR,Dr Ediga Anjaneya Goud,Chairman of Telangana Sports Authority,Telangana BRS Govt,Rythu Bandhu,Telangana Rythu Bandhu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (ఫిబ్రవరి 15, బుధవారం) కొండగట్టులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కొండగట్టు ఆంజనేయ స్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పర్యటనలో కొండగట్టులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ నిర్ణయించనున్నారు. గుట్టపై ఉన్న కొత్త పుష్కరిణి, బేతాళస్వామి గుడి, కోనేరు, కొండలరాయుడి గుట్ట, సీతమ్మ కన్నీటిధార సహా ఆలయ పరిసరాల్లోని తదితర స్థలాలను సీఎం పరిశీలించనున్నారు.

అనంతరం ఆలయ అభివృద్ధిపై జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. కాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి పలుమార్లు కొండగట్టును సందర్శించి, ఆలయ అభివృద్ధి నమూనాను రూపొందించినట్టుగా తెలుస్తుంది. కొండగట్టులో సీఎం పర్యటన పర్యటన ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, జిల్లా ఎస్పీ భాస్కర్ ఇప్పటికే పరిశీలించి అధికారులు పలు సూచనలు చేశారు.

సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన షెడ్యూల్:

  • ఉదయం 9 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరి ఉదయం 9.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకుంటారు.
  • ఉదయం 9.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9.40 గంటలకు కొండగట్టు చేరుకుంటారు.
  • ముందుగా ఆలయానికి చేరుకొని ఆంజనేయ స్వామివారిని సీఎం దర్శించుకొంటారు.
  • ఆలయం వద్ద అభివృద్ధి చేయాల్సిన ప్రదేశాలను పరిశీలిస్తారు.
  • అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహిస్తారు.
  • మధ్యాహ్నం 1 గంటకు కొండగట్టు నుంచి హెలికాప్టర్‌ ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు కు చేరుకొంటారు.
  • మధ్యాహ్నం 1.35 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు సీఎం ప్రగతిభవన్‌కు చేరుకొంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =