తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24 సమావేశాలు శుక్రవారం ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (ఫిబ్రవరి 4, శనివారం) రెండో రోజూ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభ, శాసనమండలిలో చర్చ జరుగుతుంది. ముందుగా శాసనసభలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మరియు శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిన్న ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే శాసనసభలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, శాసనమండలిలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ రెండో తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలపరిచారు. వార్షిక నివేదికలను కూడా పలువురు రాష్ట్ర మంత్రులు టేబుల్ ఐటమ్స్‌గా ఈ రోజు ఉభయసభల్లో సమర్పించనున్నారు.
మరోవైపు ఫిబ్రవరి 5, 7 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. ఫిబ్రవరి 6, సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ.హరీశ్ రావు శాసనసభలో, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన బడ్జెట్‌పై మరియు బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. కాగా మిగతా అంశాలు, బడ్జెట్ సమావేశాలు ఎప్పటివరకు వరకు కొనసాగించాలననేది ఫిబ్రవరి 8న సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE