క్యాన్సర్ నివారణలో 2030 నాటికి దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ – మంత్రి విడదల రజిని

Minister Vidadala Rajini, AP will be First Place in The Country To Prevent Cancer by 2030, Mango News, Mango News Telugu, Minister Vidadala Rajini about World Cancer Day, World Cancer Day 2023, AP Health Minister Vidadala Rajini, Cancer Prevention, Minister Vidadala Rajini Latest News, World Cancer Day, Cancer Day Awareness, World Cancer Awareness Day

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్యాన్సర్ నివారణలో 2030 నాటికి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని. ఈ మేరకు ఆమె శనివారం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మీడియాతో దీనిపై మాట్లాడారు. ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 1కోటి 60 లక్షల మంది వరకు క్యాన్సర్ వ్యాధిన పడుతున్నారని, అయితే ఇటీవలి జీవన విధానాల వల్ల 2030 నాటికి దాదాపు 30 కోట్ల మంది ఈ మహమ్మారి బారిన పడే అవకాశాలున్నాయని తెలియజేశారు. డబ్ల్యూహెచ్ఓ వెల్లడించిన నివేదికలను కొట్టిపారేయడానికి లేదని, ప్రతి ఒక్కరూ ఈ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

ఈ నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, మహమ్మారిని ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు తీసుకుంటుందని మంత్రి రజిని తెలిపారు. క్యాన్సర్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించిందని గుర్తు చేసిన మంత్రి.. క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రతిష్టాత్మక హోమీబాబా క్యాన్సర్ కేర్ సెంటర్ తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని కూడా వివరించారు. అలాగే రాయలసీమ ప్రాంత వాసులకు అందుబాటులో కర్నూలులో రూ.120 కోట్లతో క్యాన్సర్ యూనిట్, ఇంకా ఉత్తరాంధ్ర వాసుల కోసం రూ.60 కోట్లతో క్యాన్సర్ క్రిటికల్ కేర్ యూనిట్ వంటివి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇక ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలని, క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని మంత్రి విడదల రజిని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =