కాంగ్రెస్‌కు జై కొట్టిన కోదండ రాం

kodandaram give support to congress,kodandaram give support,support to congress,Mango News,Mango News Telugu,congress, tjs, telangana janasamithi, telangana assembly elections,Telangana Politics, Telangana Political News and Updates,Hyderabad News,Telangana News,Telangana Assembly Elections,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,kodandaram Latest News,kodandaram Latest Updates
congress, tjs, telangana janasamithi, telangana assembly elections

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులను హక్కున చేర్చుకుంటూ ముందుకెళ్తోంది. అయితే ముందంజలో దూసుకెళ్తున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు మరో పార్టీ మద్ధతు లభించింది. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు తెలంగాణ జనసమితి పార్టీ కూడా కాంగ్రెస్‌కు జై కొట్టింది. ఆ పార్టీకి మద్ధతు తెలియజేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయమని.. కాంగ్రెస్‌కు మద్ధతిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం ప్రకటించారు.

అయితే కొద్దిరోజులుగా కాంగ్రెస్‌కు టీజేఎస్ మద్ధతు ఇవ్వనుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. టీజేఎస్ కార్యాలయానికి వెళ్లి కోదండ రాంతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా.. తమకు మద్ధతివ్వాలని కోరారు. ఈ మేరకు కోదండ రాం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా.. కాంగ్రెస్‌కు మద్ధతిస్తామని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ తరుపున ప్రజల్లోకి వెళ్తామని వెల్లడించారు. దీంతో ఇన్నిరోజులు వెలువడిని ఊహాగానాలు నిజమయ్యారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను మట్టి కరిపించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కోదండ రాం ప్రకటించారు. త్వరలోనే కేసీఆర్ గుట్టును బయటపెడుతానని వెల్లడించారు. కానీ పదవులు, టికెట్లు ఆశించి.. కాంగ్రెస్‌కు మద్ధతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండ రాంను కేసీఆర్ అన్ని విధాలుగా వాడుకున్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత పక్కన పెట్టేశారన్నారు. అప్పటి నుంచి ప్రజల కోసం.. కేసీఆర్‌పై కోదండ రాం పోరాడుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో తమకు మద్ధతు ఇవ్వాలని అడిగిన వెంటనే ఆయన అంగీకరించారని వివరించారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే ఆయన మద్ధతు, సహకారం అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా సమన్వయ కమిటీని నియమించుకుంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =