తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 3 తేదీ మధ్యాహ్నం 12:10 గంటలకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలిరోజునే శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ముందుగా సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్ లో రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాఖల వారిగా బడ్జెట్ ప్రతిపాదిత అంచనాలు, అధికారులు అందించిన ఆర్థిక నివేదికల పరిశీలన, బడ్జెట్ పై కసరత్తు నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 3 నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించి, రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE