యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాల్సిందేనని, పరీక్షలు జరపకుండా వారిని ప్రమోట్ చేసే అవకాశం లేదని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో ఫైనల్ ఇయర్/సెమిస్టరు పరీక్షలు నిర్వహణపై యూనివర్సిటీలు కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 16 -25 తేదీల మధ్యలో మూడు రోజుల పాటుగా బీటెక్ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది.
జేఎన్టీయూహెచ్ పరిధిలోని అనుబంధ కాలేజీలకు పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన డిగ్రీ, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల ఫైనల్ ఇయర్ పరీక్షలను సెప్టెంబర్ 30 లోగా పూర్తిచేయాల్సి ఉంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాలతో అన్ని యూనివర్సిటీలు ఈ పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu