బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..

MP Venkatesh netha, BRS, Congress, Peddapalli MP, Telangana Politics, Lok sabha elections, TPCC, kcr, AICC, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, Mango News Telugu, Mango News
MP Venkatesh netha, BRS, Congress, Peddapalli MP, Telangana Politics

లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది గులాబీ పార్టీ. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ.. మెజార్టీ లోక్ సభ స్థానాలనైనా దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. తద్వారా ఢిల్లీలో చక్రం తిప్పొచ్చని పథకాలు రచిస్తోంది. ఇప్పటికే ఎన్నికల కదనరంగంలోకి దూకేసిన బీఆర్ఎస్.. వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. అయితే అటు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నుతోంది. కాంగ్రెస్ కూడా మెజార్టీ లోక్ సభ స్థానాలపై కన్నేసింది. రాష్ట్రంలో అధికారం దక్కించుకున్నట్లుగానే.. లోక్ సభ స్థానాలను కూడా కొల్లగొట్టాలని వ్యూహాలు రచిస్తోంది.

ఈ మేరకు తెలంగాణలో ఆపరేషన్ ఆకర్స్ మొదలు పెట్టింది. ఇతర పార్టీల్లోని నేతలను తమ గూటికి ఆహ్వానిస్తోంది. అయితే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉండడంతో నేతలు కూడా ఆ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ గూటికి చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ నేతల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

వాస్తవానికి వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతనే. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటేశ్ నేత కాంగ్రెస్ తరుపున చెన్నూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పెద్దపల్లి నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌ను చిత్తుగా ఓడించి.. 95 వేల ఓట్ల మెజార్టీతో వెంకటేశ్ గెలుపొందారు.

ఇక ఇటీవల ఆయన కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో.. ఆయన తిరిగి సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోన్న బీఆర్ఎస్‌కు ఇది బిగ్ షాక్ అని విశ్లేషకులు అంటున్నారు. వెంటకేశ్ బాటలోనే మరికొంత మంది ఎంపీలు కూడా కాంగ్రెస్ బాట పట్టే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 16 =