తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. నర్సింగ్‌ విద్యార్థిని మిస్సింగ్‌ కేసులో కీలక లీడ్?

Telangana NIA Conducts Raids at Several Places in a Nursing Student Missing Case, Telangana NIA Conducts Raids at Several Places, NIA Conducts Raids at Several Places in a Nursing Student Missing Case, Nursing Student Missing Case, Telangana NIA Conducts Raids, NIA Conducts Raids, Telangana NIA, nursing student kidnap case, nursing student, National Investigation Agency, Telangana National Investigation Agency, NIA carries out raids in Telangana, Telangana, Nursing Student Missing Case News, Nursing Student Missing Case Latest News, Nursing Student Missing Case Latest Updates, Nursing Student Missing Case Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. ఒక నర్సింగ్‌ విద్యార్థిని మిస్సింగ్‌ కేసులో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తోంది. ఈ క్రమంలో ఉప్పల్‌ చిలుకానగర్‌లోని హైకోర్టు అడ్వకేట్‌ చుక్కా శిల్ప ఇంటిపై ఎన్‌ఐఏ అధికారులు దాడిచేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక మరోచోట పర్వతపురంలోని చైతన్య మహిళా సంఘం నేత దేవేంద్ర, అంబేద్కర్‌ పూలే యువజన సంఘం అధ్యక్షుడు కిరణ్‌ ఇంటిపై కూడా అధికారులు దాడులు చేశారు. అయితే శిల్పను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శిల్పా మరియు ఇతరులపై విశాఖపట్నం పోలీసులు బుక్ చేసిన బాలిక కిడ్నాప్ కేసుకు సంబంధించి సోదాలు నిర్వహించిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాధ అనే నర్సింగ్ విద్యార్థిని గత మూడున్నరేళ్లుగా కనిపించకుండా పోయింది. దీంతో రాధా తల్లి ఏపీలోని విశాఖలో 2017 డిసెంబరులో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అక్రమ నిర్బంధం, చట్టవిరుద్ధంగా సమావేశం, అల్లర్లు, నేరపూరిత కుట్ర మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నాయకులు తన కూతురిని కిడ్నాప్‌ చేశారని, బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని అప్పుడు బాలిక తల్లి ఆరోపించారు. కాగా దీనిని ఇప్పుడు ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. 2017 డిసెంబర్‌లో వైద్యం కావాలనే సాకుతో దేవేంద్ర రాధను బలవంతంగా తీసుకెళ్లాడని, అప్పటి నుంచి ఆమె ఇంటికి తిరిగి రాలేదని, ఆ తర్వాత ఆమె నిషేధిత సంస్థలో చేరినట్లు తెలిసిందని రాధ తల్లి ఎన్‌ఐఏకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ కేసు రిజిస్టర్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే శిల్ప, దేవేంద్రతోపాటు కిరణ్‌ ఇండ్లలో ఎన్‌ఐఏ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + seventeen =