తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Telangana Cabinet Meeting Started At Pragathi Bhavan

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా అక్టోబర్ 13న అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీకి సంబంధించిన చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. అలాగే యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంట సాగు విధానం, గ్రామాల్లో వానాకాలం పంటల కొనుగోలుపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. మరోవైపు కరోనా పరిస్థితులు, పాఠశాలలు, థియేటర్స్ ప్రారంభంపై చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. అక్టోబర్ 13న శాసనసభ, అక్టోబర్ 14న శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. 13 వ తేదీన శాసనసభలో ప్రవేశ పెట్టే తీర్మానాలను, 14న మండలిలో ప్రవేశపెట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu