తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు (జూలై 25, సోమవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరనున్నారు. రెండు, మూడు రోజుల పాటుగా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సీఎం వెంట పలువురు రాష్ట్ర ఎంపీలు, మంత్రులు కూడా ఉండనున్నారు. మరోవైపు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ గతకొంతకాలంలో పలుసార్లు ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాలపై వివిధ విపక్ష పార్టీల నేతలతో చర్చించేందుకు సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి ఓటమి, త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తుండడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY