తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో మాక్లూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఇంట్లో నిర్వహించే ద్వాదశ దినకర్మలో సీఎం కేసీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయానికి సీఎం కేసీఆర్ మాక్లూర్ చేరుకోనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ