రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాల బలోపేతం పురోగతిపై సీఎస్ సమీక్ష

Chief Secretary Somesh Kumar, CS Review on Strengthening Medical Infrastructure, Mango News, Somesh Kumar, Somesh Kumar Held Review on Strengthening Medical Infrastructure, Strengthening Medical Infrastructure, Strengthening Medical Infrastructure In Telangana, Telangana Chief Secretary, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Held Review on Strengthening Medical Infrastructure, Telangana CS Somesh Kumar Held Review on Strengthening Medical Infrastructure in the State

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడం, అదనపు అంతస్తుల నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని బోధన మరియు జిల్లా ఆసుపత్రుల్లో పీడియాట్రిక్ ఆక్సిజన్ మరియు ఐసీయూ పడకలను పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.

జిహెచ్ఎంసి పరిధిలోని ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, వ్యాక్సినేషన్ కోసం మిగిలిన వారందరినీ గుర్తించుటకు ప్రత్యేక “మాప్ అప్ డ్రైవ్” నిర్వహించాలని అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా.రమేష్ రెడ్డి, టిఎస్ఎమ్ఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టిఎస్ఐఐసి సి.ఇ శ్యామ్ సుందర్, టిఎస్ఎంఐడిసి సి.ఇ రాజేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ