సిద్దిపేట రీజినల్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు

Telangana Minister Harish Rao Lays Foundation Stone For The Regional Ring Road at Siddipet, Telangana Health Minister Harish Rao Lays Foundation Stone For The Regional Ring Road at Siddipet, Health Minister Harish Rao Lays Foundation Stone For The Regional Ring Road at Siddipet, Minister Harish Rao Lays Foundation Stone For The Regional Ring Road at Siddipet, Harish Rao Lays Foundation Stone For The Regional Ring Road at Siddipet, Foundation Stone For The Regional Ring Road at Siddipet, Foundation Stone For The Siddipet Regional Ring Road, Regional Ring Road at Siddipet, Siddipet Regional Ring Road, Telangana Health Minister Harish Rao, Telangana Minister Harish Rao, Health Minister Harish Rao, Telangana Health Minister, Minister Harish Rao, Harish Rao, Telangana Minister, Foundation Stone, Siddipet Regional Ring Road News, Siddipet Regional Ring Road Latest News, Siddipet Regional Ring Road Latest Updates, Siddipet Regional Ring Road Live Updates, Mango News, Mango News Telugu,

డబుల్ లేన్ రింగ్ రోడ్డు సిద్దిపేటకు మణిహారం లాంటిందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఆయన శుక్రవారం సిద్ధిపేట జిల్లా చిన్న కోడూరు మండల కేంద్రంలో సుమారు రూ. 160 కోట్ల వ్యయంతో సిద్దిపేట రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులకు జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజా శర్మతో కలిసి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రింగ్ రోడ్డు సిద్దిపేటకు వరమని, మెడలో మణిహారంలా ఉంటుందని పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణం చుట్టూ 7 మండలాలను కలుపుతూ 88 కిలోమీటర్ల మేరకు రూ. 160 కోట్లతో రింగ్ రోడ్ వేస్తున్నామని, దీని వలన ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరుగుతుందని, తద్వారా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని మంత్రి హరీష్ తెలిపారు.

కేంద్రం నుంచి సహకారం లేకపోయినా రాష్ట్రంలోని రైతులెవరూ ఇబ్బంది పడకూడదన్న ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తున్నారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఒకవైపు ఏపీలో బావుల వద్ద మీటర్లు పెడతామని ఆ ప్రభుత్వం 4 శాతం ఎఫ్ఆర్‌బీఎం నిధులు తెచ్చుకుందని, దాన్ని సాకుగా చూపి ఇక్కడ కూడా వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టమని బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని, అయినా సరే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అందుకు ఒప్పుకోమని తెగేసి చెప్పారని తెలిపారు. తెలంగాణలో రైతుల కోసం సీఎం కేసీఆర్ రూ. 25 వేల కోట్లు వద్దనుకున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనలేదు కానీ, ప్రజలకు నూకలు తినిపించమని అవమానపరిచిందని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =