దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 50 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసులు పంపిణీ

covid 19 vaccination coverage in india, India Vaccination, India’s Covid-19 vaccination coverage, India’s Covid-19 vaccination coverage tops 500 million, India’s Cumulative COVID-19 Vaccination, India’s cumulative Covid-19 vaccine coverage, India’s Cumulative Covid-19 Vaccination Coverage, India’s Cumulative Covid-19 Vaccination Coverage Crosses Key Milestone, India’s Cumulative Covid-19 Vaccination Coverage Crosses Key Milestone of 50 Cr, Mango News

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ మరో కీలకమైన మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 50 కోట్లు దాటింది. జూన్ 21 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నెలలో దేశంలోని వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 75% కేంద్ర ప్రభుత్వం సమీకరించి రాష్ట్రాలకు/కేంద్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుంది. దీంతో రోజువారీగా లక్షల సంఖ్యలో లబ్ధిదారులకు వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరుగుతుంది.

దేశంలో హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతుండగా, ఆగస్టు 7, శనివారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 50 కోట్లు (50,10,09,609) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే 49.55 లక్షలమందికి పైగా(49,55,138) వ్యాక్సిన్ తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు 60 ఏళ్లు వయసు దాటిన వారిలో 23.6%, 45-60 ఏళ్ల వయసు వారికి 32.9%, 18-44 ఏళ్ల వయసు వారికి 43.5% మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని తెలిపారు.

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వివరాలు (ఆగస్టు 7, ఉదయం 7 గంటల వరకు):

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,03,28,986
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 79,53,278
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,82,06,470
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 1,16,55,584
  • 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 17,26,01,639
  • 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 1,12,87,774
  • 45-59 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 11,08,54,315
  • 45-59 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 4,19,57,311
  • 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు): 7,80,50,150
  • 60 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు): 3,81,14,102
  • పంపిణీ చేసిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 50,10,09,609

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 3 =