తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. ఖమ్మం రూరల్, గోదావరిఖని, జనగాం, బెల్లంపల్లి, గోపాలపురం, రాజేంద్రనగర్ ఏసీపీలు, ఇతర డీఎస్పీలు సహా మొత్తం 20 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని, అందుకు అనుగుణంగా స్టేషన్స్ లో రిలీవింగ్, రిపోర్టింగ్ ఉండాలని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో డీఎస్పీల బదిలీల వివరాలు:
- స్టేషన్ ఘన్‌పూర్ ఏసీపీగా డీ రఘుచందర్ నియామకం
- మహబూబాబాద్ ఎస్డీపీఓగా పీ.సదయ్య
- మెట్‌పల్లి ఎస్డీపీఓగా వంగా రవీందర్ రెడ్డి
- ప్రస్తుతం మెట్‌పల్లి ఎస్డీపీఓగా ఎండీ గౌస్ బాబాను హైదరాబాద్ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- గోదావరిఖని ఏసీపీగా ఎస్.గిరి ప్రసాద్
- ప్రస్తుతం గోదావరిఖని ఏసీపీగా ఉన్న వీ.ఉమేందన్ ను హైదరాబాద్ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- ఖమ్మం రూరల్ ఏసీపీగా జీ.బస్వా రెడ్డి
- ప్రస్తుతం ఖమ్మం రూరల్ ఏసీపీగా ఉన్న ఎస్.వెంకట్ రెడ్డిని హైదరాబాద్ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- వికారాబాద్ ఎస్డీపీఓగా బీవీ సత్యనారాయణ
- ప్రస్తుతం వికారాబాద్ ఎస్డీపీఓగా ఉన్న ఏ.సంజీవరావును హైదరాబాద్ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- జనగాం ఏసీపీగా జీ.కృష్ణ
- ప్రస్తుతం జనగాం ఏసీపీగా ఉన్న ఎస్.వినోద్ కుమార్ ను హైదరాబాద్ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- బెల్లంపల్లి ఏసీపీగా ఏ.మహేశ్
- ప్రస్తుతం బెల్లంపల్లి ఏసీపీగా ఉన్న ఎంఏ.రహమాన్ ను హైదరాబాద్ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- మహబూబ్‌నగర్ ఎస్డీపీఓగా బీ.కిషన్
- ప్రస్తుతం మహబూబ్‌నగర్ ఎస్డీపీఓగా ఉన్న జీ శ్రీధర్ ను హైదరాబాద్ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- హైదరాబాద్ లోని గోపాలపురం ఏసీపీగా ఎన్.సుధీర్
- ప్రస్తుతం గోపాలపురం ఏసీపీగా ఉన్న పీ.వెంకట రమణను హైదరాబాద్ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- రాజేంద్రనగర్ ఏసీపీగా బీ.గంగాధర్
- ప్రస్తుతం రాజేంద్రనగర్ ఏసీపీగా ఉన్న ఆర్.సంజయ్ కుమార్ ను హైదరాబాద్ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ