టీఎస్‌ ఈసెట్-2022 అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల

Telangana ECET 2022 Admissions Counselling Schedule Released, TS ECET Admission Counselling Date Released, Telangana ECET 2022, TS ECET 2022 Counselling Schedule, Mango News, TS ECET Latest News And Updates, TS ECET Counselling 2022, Telangana State Engineering Common Entrance Test, TS ECET 2022, TSECET Latest News And Live Updates, Telangana, KCR, TRS Party

తెలంగాణ రాష్ట్రంలో ఆగ‌స్టు 1న నిర్వహించిన టీఎస్ ఈసెట్-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆగస్టు 12న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. ఈసెట్-2022లో 90.69 శాతం మంది ఉత్తీర్ణులయినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో టీఎస్ ఈసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ గురువారం నాడు విడుద‌లైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్.లింబాద్రి ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం డిప్లొమా, బీఎస్సి మాథెమాటిక్స్ విద్యార్దులకు ఈసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ/బీటెక్, బీఫార్మ‌సీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలోకి రెగ్యులర్‌ ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. సెప్టెంబ‌ర్ 7వ తేదీ నుంచి ఈసెట్-2022 ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. సెప్టెంబ‌ర్ 17న మొద‌టి విడుత సీట్ల కేటాయింపు, సెప్టెంబర్ 29న రెండో విడత సీట్ల కేటాయింపు జ‌ర‌గ‌నుంది.

టీఎస్‌ ఈసెట్-2022 అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్:

మొదటి విడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – సెప్టెంబర్ 9 నుంచి 12 వరకు
  • సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనంతరం వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు
  • సీట్లు కేటాయింపు – సెప్టెంబర్ 17
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు

తుది విడత:

  • సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – సెప్టెంబర్ 25
  • సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – సెప్టెంబర్ 26
  • సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనంతరం వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు
  • తుది విడత సీట్లు కేటాయింపు – సెప్టెంబర్ 29
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 7 వరకు
  • విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీలలో రిపోర్ట్ చేయడం : సెప్టెంబర్ 30 మరియు అక్టోబర్ 10 మధ్య
  • ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఇంజనీరింగ్ మరియు బిఫార్మసీ కాలేజీలకు స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలు ప్రకటన: సెప్టెంబర్ 30

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY