టీఎస్‌ పాలిసెట్‌-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Telangana Polycet-2022 Counselling Schedule Released, Polycet-2022 Counselling Schedule Released, TS Polycet-2022 Counselling Schedule Released, Telangana Polycet-2022, 2022 Telangana Polycet, Telangana Polycet, Counselling Schedule Released, Telangana Polycet-2022 admission schedule announced, Telangana Technical Education Department has released the POLYCET-2022 counselling schedule, Telangana Technical Education Department, State Board of Technical Education and Training, TS Polycet-2022 Counselling Schedule Released News, TS Polycet-2022 Counselling Schedule Released Latest News, TS Polycet-2022 Counselling Schedule Released Latest Updates, TS Polycet-2022 Counselling Schedule Released Live Updates, Telangana Polycet Result 2022 declared, TS Polycet-2022 Result Out Now, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)-2022 ఫలితాలు నేడు (జూలై 13, బుధవారం) విడుదల అయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి చైర్మన్ నవీన్ మిట్టల్ నాంపల్లిలోని కార్యాలయంలో పాలిసెట్ ర్యాంకులను విడుదల చేశారు. పాలిసెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులంతా అధికారిక వెబ్‌సైట్‌ www.polycetts.nic.in లో ఫలితాలను చూసుకుని, ర్యాంక్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఫలితాల విడుదల నేపథ్యంలో టీఎస్‌ పాలిసెట్‌-2022 ప్రవేశ పక్రియ/కౌన్సెలింగ్ షెడ్యూల్ ను కూడా అధికారులు విడుదల చేశారు.

టీఎస్‌ పాలిసెట్‌-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్:

  • జూలై 18 నుంచి‌ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
  • జూలై 18 నుంచి 22 వరకు ధ్రువీకరణపత్రాలు, సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్
  • జూలై 20 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన
  • జూలై 20 నుంచి 25 వరకు వెబ్‌ ఆప్షన్స్ నమోదు
  • జూలై 27 న మొదటి విడత పాలిటెక్నిక్‌ సీట్లు కేటాయింపు
  • జూలై 27 నుంచి 31 వరకు కేటాయించిన కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్
  • ఆగస్టు 1 నుంచి పాలిసెట్‌-2022 తుది విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
  • ఆగస్టు 1న ధ్రువీకరణపత్రాలు, సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్
  • ఆగస్టు 2న సర్టిఫికెట్ల పరిశీలన
  • ఆగస్టు 1 నుంచి 3 వరకు వెబ్‌ ఆప్షన్స్ నమోదు
  • ఆగస్టు 6 న తుది విడత పాలిటెక్నిక్‌ సీట్లు కేటాయింపు
  • ఆగస్టు 6 నుంచి 10 వరకు కేటాయించిన కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్
  • ఆగస్టు 8న పాలిసెట్ స్పాట్ అడ్మిష‌న్ల విధి విధానాలు వెల్ల‌డి
  • ఆగస్టు 8 నుంచి 16 వరకు ఓరియెంటేషన్ కార్యక్రమాలు
  • ఆగస్టు 17 నుంచి పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + nineteen =