రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం వుంటుందని పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్ టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని కూడా కేబినెట్ నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ