ఆస్కార్ రేసులోకి రామ్ చరణ్, మొత్తం ఐదు విభాగాల్లో బరిలోకి ఆర్ఆర్ఆర్?

Variety Predicts Oscar Nominations for RRR Ram Charan Enters Into the Best Actor Prediction List, Oscars 2023, Ram Charan for Oscars, RRR, SS Rajamouli, Jr NTR, Ram Charan, Ram Charan Enters in to Oscar Predictions, Ram Charan Oscars 2023 Best Actor Contender, RRR In Variety Oscars Prediction List , Oscar Nominations 2023 Best Actor List, Best International Film , Best Original Song, Variety Magazine, Mango News, Mango News Telugu

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొంది, ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పలు రికార్డులను కొల్లగోట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అద్భుత నటనకు, కొమురం భీం పాత్రలో విజృంభించిన జూ.ఎన్టీఆర్‌ కు దేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానుల నుంచి ప్రశంసలు దక్కాయి.

కాగా ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం ఐదు విభాగాల్లో ఆస్కార్ బరిలోకి నిలిచే అవకాశం దిశగా దూసుకెళ్తుంది. అమెరికాలో పేరొందిన ‘వెరైటీ’ అనే వెబ్ సైట్ లో 2023 ఆస్కార్‌ అవార్డ్స్ ప్రెడిక్షన్ జాబితాను మరోసారి అప్డేట్ చేసింది. గతంలోనే వెరైటీ వెబ్ సైట్ ప్రకటించిన అన్ ర్యాంక్డ్ పాజిబుల్ కంటెండర్స్ (బెస్ట్ యాక్టర్) ప్రిడిక్షన్స్ జాబితాలో ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రకు గానూ జూ.ఎన్టీఆర్‌ చోటు దక్కించుకున్నారు. తాజా జాబితాలో బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్స్ జాబితాలో రామ్ చరణ్ కూడా చోటు దక్కించుకున్నారు. దీంతో మెగా అభిమానుల్లో ఆనందం నెలకొంది. అలాగే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు నటులు ప్రపంచ అత్యుత్తమ అవార్డుల ప్రిడిక్షన్స్ జాబితాలో ఉండడంతో తెలుగు సినీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక ఉత్తమ నటుడు కేటగిరితో పాటుగా ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఇలా మొత్తం 5 కేటగిరీల్లో వెరైటీ ప్రిడిక్షన్స్ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చోటు దక్కించుకుంది. తరువాతి క్రమంలో ఈ 5 కేటగిరీలకు సంబంధించి ఆస్కార్ అవార్డుకు నామినేషన్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిలిస్తే, సంచలనం నమోదై తెలుగు సినీ పరిశ్రమ పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగనుంది.

2023 ఆస్కార్ నామినేషన్స్ – వెరైటీ ప్రిడిక్షన్స్ జాబితా : ఆర్ఆర్ఆర్

1. ఉత్తమ నటుడు – రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్‌
2. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్
3. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
4. ఉత్తమ దర్శకుడు – ఎస్.ఎస్ రాజమౌళి
5. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – దోస్తీ (తెలుగు).

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + fifteen =