తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో చీఫ్ విప్ గా, విప్ లుగా ముగ్గురిని ఖరారు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తనిపర్తి భానుప్రసాద రావు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించబడ్డారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సుంకరి రాజు (శంభీపూర్ రాజు), పాడి కౌశిక్ రెడ్డిలు ప్రభుత్వ విప్ లుగా నియమితులయ్యారు. ఈ నియామకాలు 2023, ఫిబ్రవరి 11 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE