ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు కుటుంబసభ్యులకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కు అందజేత

FRO Srinivas Rao Incident Officials Handed Over 50 Lakhs Ex-gratia Cheque to His Family Members,FRO Srinivas Rao Incident,FRO Srinivas Rao 50 Lakhs Ex-gratia,50 Lakhs Ex-gratia To Srinivas Rao Family Members,Mango News,Mango News Telugu,Forest Range Officer Srinivasa Rao,Srinivasa Rao,Announces Exgratia Rs.50 Lakhs,Fro Death,Kcr Announces An Ex-Gratia,Tjfoa Condemns Attack On Forest Ranger,Telangana Forest Ranger Srinivasa Rao,Telangana Forest Ranger,Telangana Forest Ranger Death,Telangana Forest Ranger Latest News And Updates,Telangana Cm Kcr

ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో దివంగత ఫారెస్ట్ రేంజర్ (ఎఫ్ఆర్వో) శ్రీనివాస రావు కుటుంబాన్ని సోమవారం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) భీమా నాయక్, స్థానిక నాయకులు, అధికారులు పరామర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన విధంగా, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కును శ్రీనివాస్ రావు భార్య , పిల్లలకు వారు అందజేశారు. శ్రీనివాస్ రావు కుటుంబానికి ధైర్యం చెప్పి, అండగా ఉంటామని నాయకులు, అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ లు సిద్దార్థ్ విక్రమ్ సింగ్, రంజిత్ నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మేయర్ నీరజ, తదితరులు పాల్గొన్నారు. ఈర్లపుడిలో సీసీఎఫ్ భీమా నాయక్ మాట్లాడుతూ, “శ్రీనివాసరావు హత్య బాధాకరం, అత్యంత దారుణం. వారి కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వం మంజూరు చేసిన 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కును వారి కుటుంబానికి అందజేశాం. వారి కుటుంబానికి ప్రకటించిన ఉద్యోగం, ఇంటి స్థలము, పిల్లల చదువు, ఇతర బెనిఫిట్స్ విషయంలో సహకరిస్తాం” అని తెలిపారు.

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంద్రుగొండ మండలం బెండాల‌పాడు గ్రామ ప‌రిధిలో నవంబర్ 22న గుత్తి కోయ‌లు గొడ్డలితో దాడి చేయడంతో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రీనివాస రావు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేసి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మరణించిన ఎఫ్ఆర్వో కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటుగా, దాడిలో మరణించిన శ్రీనివాస రావు డ్యూటీలో వుంటే ఏవిధంగానైతే నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని, రిటైర్ మెంట్ వయస్సువరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. అలాగే సీఎం ఆదేశాల మేరకు నవంబర్ 23న ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ లు కూడా ఎఫ్ఆర్వో అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =