తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Telangana Intermediate Second Year Advanced Supplementary Results 2022 Released, Telangana Inter Supply Results , Inter 2nd Year Supply Results 2022, Inter 2nd Year Supplementary Results, 2nd Year Supplementary Results 2022 Released, Mango News, Mango News Telugu, TS Inter Supplementary Results 2022 , TS Inter Advanced Supplementary, Inter Supplementary Results News And Live Updates, TS Inter Supplementary Results, Telangana State Supply Results

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ-2022 పరీక్షలను ఆగస్టు 1 నుంచి 10 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలను రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ విడుదల చేశారు. ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,14,289 మంది విద్యార్థులు (జనరల్-1,02,236, ఓకేషనల్- 12,053) హాజరైనట్టు తెలిపారు. కాగా జనరల్ కోర్సుల్లో 48,816 మంది విద్యార్థులు (47.74 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక ఓకేషనల్ 7,843 మంది విద్యార్థులు (65.07 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను https://tsbie.cgg.gov.in/ లేదా https://results.cgg.gov.in/ వెబ్ సైట్స్ లో చూసుకోవచ్చని తెలిపారు. ఇక సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 8 వరకు రీకౌంటింగ్‌కి అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు మంగళవారం సాయంత్రం ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ వెల్లడించారు. ఎంసెట్-2022 కౌన్సెలింగ్ నేపథ్యంలో ముందుగా సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =