తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మే 17, 2021 నుంచి మే 26, 2021 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదోతరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న 2.20 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ