ఈ ఆహారాలను మళ్లీ మళ్లీ వేడిచేసి తినొద్దు?

Do not reheat and eat these foods,Do not reheat and eat,reheat and eat these foods,Reheating Food Side Effects,Mushrooms ,Chicken,Nonveg, Potato,Rice,Spinach ,favorite food,Mango News,Mango News Telugu,Foods Reheat Latest News,Mushrooms Side Effects,Foods Reheating Latest Updates,Do not reheat News Today,Reheating Food Side Effects News,Food Side Effects Latest Updates
Reheating Food Side Effects,Mushrooms ,Chicken,Non-veg, Potato,Rice,Spinach ,favorite food

సాధారణంగా ఎవరింట్లో అయినా  అన్నం, కూరలు మిగిలిపోతే..వాటిని ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత రోజు వేడి చేసుకుని తింటుంటారు. చలికాలంలో కూడా  వండిన కాసేపటికే ఆహారాలు చల్లగా అవడంతో.. వాటిని మళ్లీ వేడి చేసుకుని తినేస్తుంటారు. అయితే ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినడం ఆరోగ్యానికి అస్సలు  మంచిది కాదని  నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలా మంది కాస్త వండిన ఆహారం కాస్త చల్లారినా  తినడానికి ఇష్టపడరు . వాటిని మరోసారి తినేముందు వేడి చేసుకుని  వేడివేడిగా తింటుంటారు. అలాగే మిగిలిన ఆహారపదార్ధాలు ఫ్రిజ్‌లో ఉన్నా వాటిని వేడి చేసుకుని తింటూ ఉంటారు. అయితే ఇలా వేడి చేయడం వల్ల వాటిలో ఉండే పోషక పదార్థాలు నాశనం అవుతాయని అంతేకాదు కొన్నిసార్లు టాక్సిన్స్ ఫామ్ అయ్యి ఆరోగ్యానికి హాని కూడా చేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చిన్నపిల్లలు మొదలు పెద్దవాళ్ల వరకు చాలా మందికి పొటాటోతో ఏ వంటకాలు అయినా తెగ నచ్చుతాయి. అందుకే దానితో ఏ వెరైటీ చేసినా కూడా అవి మిగిలిపోతే  వేడి చేసుకుని మరీ తింటారు. అయితే బంగాళాదుంపలను మళ్లీ మళ్లీ వేడి చేస్తే  క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా పెరుగుతుందట. అంతేకాదు వేడి చేయడం వల్ల ఆలుగడ్డలో  ఉండే బి-6, పొటాషియం, విటమిన్-సి విచ్చిన్నమవుతాయట. అలా వేడిచేసిన పొటాటో కర్రీని తింటే పోషకాలేమీ లభించవు పైగా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలామంది ఆకుకూరలు ఇష్టపడతారు. వారంలో రెండు, మూడు రోజులయినా ఆకుకూరతో తినడానికి ట్రై చేస్తారు. అయితే వీరిలో ఎక్కువమంది పాలకూరను ఎక్కువమంది ఇష్టపడతారు. అలా పాలకూరతో చేసే పప్పు పాలకూర, పాలక్ పనీర్, సూప్​  వంటివి చేసాక.. అవి చల్లగా అయితే వేడి చేసి తినడమో.. లేక  ఫ్రిజ్‌లో మిగిలిన వాటిని వేడిచేసుకుని మళ్లీ తినడమో చేస్తారు. అయితే పాలకూరను అలా వేడి చేస్తే అందులో ఉన్న నైట్రేట్​లు నైట్రోజినేస్​గా మారతాయట. అటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని కణజాలం దెబ్బతింటుందట.

నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్​‌లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయన్న కారణంతో చాలామంది వీటిని తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక నాన్ వెజ్ ప్రియులైతే వాటిని దాచుకుని దాచుకుని తింటూ  ఉంటారు. అయితే నాన్ వెజ్ ఫుడ్ ఐటెమ్స్‌ను వేడి చేసి తింటూ ఉంటే.. ఫుడ్ పాయిజనింగ్, జీర్ణసంబంధ సమస్యలతో బాధపడాల్సి వస్తుందట. అంతేకాదు నాన్ వెజ్‌ను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అందులోని ప్రోటీన్ కంపోజిషన్ మారిపోతుంది.

పుట్టగొడుగులను వెజిటేరియన్స్ నాన్​వెజ్ అని పిలుస్తారు. వీటిలో ప్రోటీన్స్ పుష్కలంగానే  ఉంటాయి. అయితే మష్రూమ్స్‌తో చేసిన వంటకాలు వేడి చేసి తింటే ఆరోగ్యానికి మంచిది కాదట. అంతెందుకు దీనిని వెంటవెంటనే తినేయాలి తప్ప నిల్వ కూడా చేయకూడదట. మష్రూమ్స్‌ను వేడి చేయడం వల్ల ఇందులో ప్రోటీన్లు, ఖనిజాలు.. విష పదార్థాలుగా మారుతాయట. అలా వేడి చేసిన పుట్టగొడుగులను తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే చాలా మంది లంచ్‌లో మిగిలిన అన్నాన్ని.. డిన్నర్ సమయంలో వేడి చేసుకుని తింటుంటారు. అలాగే కొందరు మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మరీ దానితో ఫ్రైడ్ రైస్, స్నాక్స్ వంటివి చేస్తుంటారు. కానీ  అలా అన్నాన్ని తిరిగి  చేయడం అస్సలు మంచిది కాదట. అలా చేయడం వల్ల దానిలోని  షోషకాలు పోవడమే కాకుండా.. శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా  పెరిగి.. ఫుడ్ పాయిజన్​ కూడా అయ్యే అవకాశాలుంటాయట. అయితే ఏ ఆహారపదార్ధాలు అయినా తగినంత వండుకుని తినడం అలవాటు చేసుకోవాలి.  ఫ్రిజ్‌లో పెట్టుకుని..వాటిని వేడి చేసుకుని తినడం మానేయాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − fourteen =