కంటైన్మెంట్ జోన్స్ లో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం

telangana, Telangana Containment Zones, Telangana Govt Extends Lockdown, Telangana Govt Extends Lockdown Till July 31st, Telangana Lockdown, Telangana Lockdown News, Telangana News

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో జూలై‌ 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జూలై 31 వరకు కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుందని చెప్పారు.

మెడికల్ ఎమెర్జెన్సీ ఉన్నవారికి, పరిశ్రమల్లో పలు షిఫ్ట్స్ లో విధులకు హాజరయ్యే వ్యక్తులకు, సరుకు రవాణా వాహనాలకు రాత్రి పూట కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఇక ఆసుపత్రులు, మెడికల్ షాప్స్ మినహా రాత్రి 9:30 గంటల తర్వాత దుకాణాలు/వాణిజ్య సంస్థలు తెరిచి ఉంచేందుకు అనుమతి లేదని తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu