తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్‌లైన్‌ తరగతులుకు భారీ స్పందన

Online Classes For Intermediate Students, Online Classes for Students, Online classes for Telangana government schools, Online Classes in Telangana, telangana, Telangana Guidelines Online Classes, Telangana Online Classes, Telangana Online Classes for Students, telangana online classes news, TSAT Online Classes, TSAT Online Classes Telangana

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్‌లైన్ విద్యకు భారీ స్పందన లభించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ విద్యను టి.సాట్ నెట్వర్క్ ఛానళ్ల ద్వార ప్రారంభించిన తెలంగాణ విద్యాశాఖ మంచి ఫలితాలను రాబట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలు చూసినట్లు టిసాట్.టీవి యాప్ ద్వారా నిర్ధారణ అయింది. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ, సమయం ప్రకారం సెప్టెంబర్ 1, మంగళవారం నాడు మూడవ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల వరకు మొదటి రోజు సుమారు ఆరు గంటల ఆన్‌లైన్ పాఠాలు బోధన జరిగింది. తొలిరోజే 11,73,921 వ్యూస్ మరియు 1,56,658 సబ్ స్క్రైబర్స్ లభించాయి. ఒక్క రోజే భారీగా విద్యార్థుల నుండి స్పందన లభించడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులతో పాటు విద్యాశాఖలోనూ ఉత్సాహం నింపింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆద్వర్యంలో విద్యా శాఖ చేస్తున్న శ్రమకు మంచి ఆదరణ లభించడంతో తెలంగాణ రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు హర్షం వ్యక్తం చేస్తూ విద్యాశాఖను, ప్రసారాలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన టి.సాట్ ను అభినందించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =