ఉపాధి హామీ కూలీలకు వేసవి భత్యం పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Mahatma Gandhi National Rural Employment, Mango News Telugu, MGNREGA, MGNREGA Sameeksha, MGNREGA Workers, MGNREGA Workers Summer Allowance Increased, National Rural Employment Guarantee Act, Telangana Goverment, Telangana Govt, Telangana Latest News
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవికాలంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు ప్రత్యేక వేసవి భత్యాన్ని ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఫిబ్రవరి 14, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఫిబ్రవరి నెల నుంచి జూన్‌ వరకు చేపట్టే పనుల్లో పాల్గొనే కూలీలకు సాధారణ పనులకు కల్పించే వేతనం కంటే 20 నుంచి 30 శాతం అధికంగా చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి నెలలో 20 శాతం, మార్చి నెలలో 25 శాతం, ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం అదనంగా కరువు భత్యాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. అలాగే ఎండల తీవ్రత అధికంగా ఉండే నేపథ్యంలో ఉపాధి హామీ పనిగంటలును కూడా తగ్గించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
[subscribe]