ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్వహించిన తన కార్యాలయంలో సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు 317 జీవో కింద వేరే జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభమైన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని, అయితే 317 జీవో కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తాజాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీనికోసం ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జనవరి 27వ తేదీన మొదలైన ఈ ప్రక్రియ దాదాపు 37 రోజుల పాటు సాగనుండగా.. ఇప్పటివరకు వచ్చిన 59 వేల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE