సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు సమావేశం.. భారీ పరిశ్రమల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు

CM YS Jagan Held AP State Investment Board Meeting Takes Key Decisions Over Establishment of Industries,CM YS Jagan Held,AP State Investment Board Meeting,Takes Key Decisions Over Establishment of Industries,Mango News,Mango News Telugu,Ap State Development Board,Ap Economic Development Board Divisions,Apedb Ceo,Ap Economic Development Board Act,Andhra Pradesh Development Projects,Ap Economic Development Board Started In Which Year,Andhra Pradesh Economy Pdf,Industrial Development In Andhra Pradesh,Ap State Development Board Chairman,Ap State Investment Promotion Board,Ap State Financial Position

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సీఎస్ జవహర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా గతంలో జరిగిన సమీక్షా సమావేశంలో కడపలోని స్టీల్‌ ప్లాంట్‌తో సహా రూ.23,985 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరియు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ద్వారా ఏర్పాటు చేయబోయే రెండు పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఏపీ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు..

  • రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రతి పరిశ్రమలో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి.
  • ప్రభుత్వ చేపట్టిన చర్యల కారణంగా పవర్ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికే ఆదాయం వచ్చేలా అధిఅక్రూలు దృష్టి సారించాలి.
  • భోగాపురంలో 90 ఎకరాల స్థలంలో ఐటీ పార్క్ ఏర్పాటుకు ఆమోదం.
  • కృష్ణ జిల్లా మల్లవల్లి దగ్గర ఇథనాల్ ఇంధన తయారీకి అవిశా ఫుడ్స్ మరియు ఫ్యూయల్స్ కంపెనీ ప్రతిపాదన.
  • దీనిద్వారా రోజుకు 500 కి.లీ సామర్ధ్యంతో రూ.498.84 కోట్ల పెట్టుబడులతో పరోక్షంగా 3,330 మందికి ఉపాధి.
  • కడియం వద్ద రూ.3,400 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 2,100 మందికి ఉపాధి లక్ష్యంగా పేపర్ మిల్స్ విస్తరణ ప్రాజెక్టు.
  • అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.1,10,000 కోట్ల పెట్టుబడులతో న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటు.
  • ఒక్కో దశలో రూ.55,000 కోట్లు చొప్పున రెండు దశల్లో పూర్తి. తద్వారా మొత్తంగా 61వేల మందికి ఉపాధి.
  • శ్రీకాళహస్తిలో రూ. 915.43 కోట్లతో, పుంగనూరులో రూ. 171.96 కోట్లతో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు.
  • మొత్తం రూ. 1087 కోట్ల పెట్టుబడులతో వీటి ద్వారా 2,350 మందికి ఉపాధి.
  • రామాయపట్నంలో రూ.10,000 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉద్యోగాలు లభించేలా అకార్డ్ గ్రూప్ కాపర్, సెలీనియం సహా ప్రత్యేక ఖనిజాల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు.
  • కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 1000 మెగావాట్ల విండ్ మరియు 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణం.
  • ఎకోరెన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.10,500 కోట్ల పెట్టుబడులు, 2వేల మందికి ఉద్యోగాలు.
  • విశాఖలోని కాపులుప్పాడలో రూ.7,210 కోట్ల పెట్టుబడితో వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు.
  • దీనిద్వారా ప్రత్యక్షంగా 14,825 మందికి, పరోక్షంగా 5,625 మందికి ఉద్యోగాలు.
  • తిరుపతిలో 15 వేళా మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రూ.1489.23 కోట్లతో వింగ్‌టెక్‌ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పరిశ్రమ ఏర్పాటు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 5 =