హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR CS Santhi Kumari Flag-off First 3 E-Double Decker buses at Hyderabad,Minister KTR ,CS Santhi Kumari,Flag-off 3 E-Double Decker buses,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

హైదరాబాద్‌ నగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం నగరంలో మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్, ఎంపీ రంజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. హెఛ్ఎండీఏ ముందుగా 6 డబుల్ డెక్కర్ బస్సులకు ఆర్డర్ ఇవ్వగా, ప్రస్తుతం మూడు బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఫిబ్రవరి 11 నుంచి ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌, ప్యారడైజ్‌, నిజాం కాలేజీ ప్రాంతాల్లో తిరుగనున్నాయి. త్వరలోనే 3 బస్సులు అందుబాటులోకి రానుండగా, ఆ సంఖ్యను 20కు పెంచాలని హెచ్‌ఎండీఏ నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ధర రూ.2.16 కోట్లు కాగా, ఈ బస్సుల్లో డ్రైవర్‌ తో కలిపి 65 మంది ప్రయాణికులు కూర్చునేలా సీటింగ్‌ సామర్థ్యం కలిగి ఉంది.

గతంలో హైదరాబాద్ నగరంలో పలు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులతో ప్రయాణికులకు సేవలందించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత కాలక్రమేణా డబుల్ డెక్కర్ బస్సులు కనుమరుగయ్యాయి. డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేస్తూ ఓ నెటిజెన్ మంత్రి కేటిఆర్ ను ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ మళ్ళీ నగరంలో డబుల్ డెక్కర్‌ బస్సులను త్వరలోనే తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నేడు మూడు బస్సులను మంత్రి కేటీఆర్ సమక్షంలో సీఎస్ శాంతి కుమారి జెండా ఊపి ప్రారంభించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 6 =