తెలంగాణలో ఇంటర్ ప్రవేశాల గడువు నవంబర్ 30 వరకు పెంపు

Mango News Telugu, Telangana Inter Board, Telangana Inter Board Extends Intermediate Admissions Date, TS Inter Admissions Date Extended, TS Inter Admissions Extended, TS Inter Board, TS Intermediate, TS Intermediate Admissions, TSBIE, TSBIE extends last date for intermediate admissions

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోకి ప్రవేశాల గడువును ముందుగా నవంబర్ 16 గా నిర్ణయించగా, తాజాగా నవంబర్ 30 వరకు పొడిగించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్ గడువు పెంచాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. పదో తరగతి పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో నిబంధనలకు అనుగుణంగా డాకుమెంట్స్ సమర్పించి అఫి‌లి‌యే‌షన్లు పొందని కాలే‌జీ‌లకు కూడా, అఫిలియేషన్స్ పొందేందుకు మరికొన్ని రోజులు గడువు పెంచనున్ననట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ